పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో చూడటానికి హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కి అభిమానులు భారీగా తరలి వెళ్లడం,అల్లుఅర్జున్(allu arjun)కూడా మూవీ చూడటానికి వెళ్లడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు.అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కూడా  అయ్యాయి.

ఇప్పుడు లాఠీ ఛార్జి చేసిన విషయంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(  NHRC)పోలీసులపై చర్యలకు ఆదేశించింది. ఇందుకు సంబంధించి లాయర్ రామారావు దాఖలు చేసిన పిటిషన్ పై  విచారించిన కోర్టు,నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ జితేందర్ కి  ఆదేశాలు జారీచేసింది.రద్దీని నియంత్రించడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారని రామారావు ఫిర్యాదు చెయ్యడంతోనే  NHRC తెలంగాణ సర్కార్ పై చర్యలకు సిద్ధమైంది.

తొక్కిసలాటలో రేవతి(revathi)అనే మహిళ చనిపోవడం,ఆమె కుమారుడు శ్రీ తేజ్(sritej)హాస్పిటల్ లో తీవ్ర గాయాలతో జాయిన్ అయిన విషయం తెలిసిందే.ప్రస్తుతం శ్రీ తేజ్  పరిస్థితి నిలకడగా ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here