బాలీవుడ్ చిత్రాలని ఫాలో అయ్యే వాళ్ళకి ప్రముఖ హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్(anurag kashyap)గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.కథని నమ్ముకొని లో బడ్జెట్ లో సినిమాలు తెరకెక్కించి ఎంతో మంది ఫిలిం మేకర్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు.రైటర్ గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనురాగ్ ఆ తర్వాత దర్శకుడుగా ‘పాంచ్’ బ్లాక్ ఫ్రైడే,నో స్మోకింగ్, రిటర్న్ ఆఫ్ హనుమన్,ముంబై కటింగ్,గులాల్,గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ పార్ట్ 1 ,పార్ట్ 2 ,బాంబే టాకీస్,ఘోస్ట్ స్టోరీస్,కెనడీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విభిన్నమైన చిత్రాలకి దర్శకత్వం వహించాడు.నటుడుగా కూడా మహరాజా,విడుదల 2 వంటి చిత్రాల్లో క్యారక్టర్ కి తగిన విధంగా అద్భుతంగా నటించి తన సత్తా చాటాడు.

అనురాగ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు మనం హిందీ సినిమాలు తెరకెక్కిస్తున్నామే కానీ ప్రేక్షకులని పట్టించుకోవడమే మానేసాం.ఈ పరిస్థితిని కొంత మంది అనువుగా చేసుకొని హిందీలో యూట్యూబ్ చానల్స్ ని ప్రారంభించారు.దక్షిణాదికి సంబంధించిన కొన్నిచిత్రాలని తక్కువ ధరకి కొనుగోలు చేసి,హిందీకి డబ్ చేస్తున్నారు.ఆ తర్వాత తమ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా హిందీ ప్రేక్షకులకి అందిస్తున్నారు.ఇప్పుడు ఆ ప్రేక్షకుల సంఖ్య భారీగా పెరిగింది.దీంతో దక్షిణాది చిత్రాలని చూడటానికి  హిందీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంతోనే పుష్ప 2 కి సంబంధించిన ఈవెంట్ ని పాట్నా లో చేపట్టారని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం పుష్ప 2 (pushpa 2)హిందీ బెల్ట్ లో తన సత్తా చాటుతూ ముందుకు దూసుపోతుంది.ఒక్క హిందీలోనే 27 రోజులకి 800 కోట్ల మార్క్ కి చేరువలో ఉంది.ఏ హిందీ హీరోకి ఇంతవరకు ఈ రికార్డు లేదని చెప్పాలి.కొన్ని డైరెక్ట్ హిందీ సినిమాలు పుష్ప 2 రిలీజ్ ఉందని వాయిదా వెయ్యడం, పుష్ప 2 షో కాకుండా రీసెంట్ గా విడుదలైన వరుణ్ ధావన్, కీర్తి సురేష్ ల ‘బేబీ జాన్’ షో వేశారని హిందీ ప్రేక్షకులు గొడవ కూడా చేసారు.దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు సౌత్ సినిమాలు తెలుగు ప్రేక్షకులని ఎంతగా ఆలరిస్తున్నాయో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here