కాలేయం శరీరంలో ఊపిరితిత్తుల కింద భాగంలో ఉండే అవయవం. కాలేయం ఎంత శుభ్రంగా ఉంటే అంత ఎక్కువ కాలం జీవించగలుగుతారు. కాలేయం నుండి విషపూరిత పదార్థాలను తొలగించుకుంటేనే అది సాధ్యం అవుతుంది. రోజువారీ కొన్ని అలవాట్లు ఫాలో అవుతుంటే కాలేయం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది. దీని వల్ల జీవితకాలం కూడా పెరుగుతుంది. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుంటే..

నీరు తాగాలి..

కాలేయం శుభ్రంగా ఉండాలంటే నీరు బాగా తాగాలి. నీరు కాలేయం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. రోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగేలా చూసుకోవాలి. ఆహారంలో నీటి శాతం ఉన్న పండ్లు, కూరగాయలు చేర్చుకోవాలి.

యాంటీ ఆక్సిడెంట్లు..

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం బాగుంటుంది. బెర్రీలు, బ్రోకలీ, బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు కాలేయ మంటను తగ్గించడంలో సహాయపడుతాయి.

కొవ్వులు..

ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకుంటే కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా చెడు కొలెస్ట్రాల్ కలిగిన ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటే కాలేయానికి ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది కాలేయ పని తీరును దెబ్బతీసి కాలేయ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది. అవకాడో, ఆలివ్ ఆయిల్, సాల్మన్, మాకేరెల్ వంటి చేపలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

వెల్లుల్లి..

వెల్లుల్లిని దివ్యౌషధంగా పేర్కొంటారు. వెల్లుల్లి కాలేయాన్ని శుద్ది చేయడంలో సహాయపడుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

గ్రీన్ టీ..

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయం మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. ప్రతి రోజూ ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీని తీసుకుంటే మంచిది.

ఫైబర్..

ఫైబర్ అనేది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే పదార్థం. ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే కాలేయం కూడా బాగుంటుంది. తృణధాన్యాలు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలు బాగా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది కాలేయ పనితీరును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

పసుపు..

పసుపులో కర్కుమిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. పిత్త ఉత్పత్తిని పెంచుతుంది.

మానాల్సినవి..

మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి చాలా చెడు చేస్తాయనే విషయం తెలిసిందే. అయితే వాటితో పాటు.. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర ఉన్న ఆహారం, నూనెలు, ఎక్కువ డీప్ ఫ్రై చేసిన ఆహారాలు మొదలైనవి.. కాలేయాన్ని సంరక్షించుకోవడంలో సహాయవడతాయి.

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here