పుష్ప 2  ప్రొడ్యూసర్లు యలమంచిలి రవిశంకర్, నవీన్ లు సంధ్య థియేటర్ ఘటన విషయంలో  తమపై నమోదయిన కేస్ ని కొట్టివేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.థియేటర్ భద్రత తమ పరిధి కాదని,తమ బాధ్యతగా ముందే పోలీసులకు సమాచారం  ఇచ్చాం కాబట్టే అంత మంది పోలీసులు అక్కడ ఉన్నారు, అన్ని చర్యలు తీసుకున్నపటికి అనుకొని ఘటన జరిగింది.జరిగిన ఘటనకి  సినిమా ప్రొడ్యూసర్లు నిందితులుగా చేరిస్తే ఎలా అని పిటిషన్ తరుపు న్యాయవాది కోరాడు.

దీంతో  ప్రొడ్యూసర్లను అరెస్ట్ చేయవద్దని హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇస్తు తదుపరి విచారణని రెండు వారాలకు వాయిదా వాయిదా వేసింది. ఇక సంధ్య థియేటర్ విషయంలో తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కి సదరు నిర్మాతలు యాభై లక్షల రూపాయలని ప్రకటించిన విషయం తెలిసిందే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here