రేణు దేశాయ్ ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఈమెకు భూతదయ చాలా ఎక్కువ. ఇలా మూగజీవాల్ని ప్రేమించే మహిళల్లో ఎవరైనా ఉన్నారు అంటే రష్మీ, సదా, రేణు దేశాయ్ ఇలా కొంతమంది ఉన్నారు. ఇక ఇప్పుడు రేణు దేశాయ్ అకీరా నందన్, ఆద్యతో కలిసి కాసి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ వాళ్ళ అప్డేట్స్ ని రెగ్యులర్ గా రేణు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు రీసెంట్ గా ఒక పోస్ట్ ని తన స్టేటస్ లో పెట్టింది. “కుక్కల్ని కాపాడేవాళ్ళను ఆ పరమ శివుడు కచ్చితంగా రక్షిస్తాడు. శివుడు అంటే ఎవరో కాదు.. ఆ కాల భైరవుడు రూపంలో ఉండే దైవమే. ఆ కాల భైరవ రూపంలో ఉండే శివుడే కుక్కల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకే అవి కూడా ఆ కాలభైరవుడిని తమ ఇష్టదైవంగా భావిస్తూ ఉంటాయి.

ఆ శివుడే తమను కాపాడుతూ ఉంటాడు అనుకుంటూ ఉంటాయి. ఎందుకంటే కాశీకి క్షేత్రపాలకుడు ఆ కాలభైరవుడే ” అంటూ రేణు దేశాయ్ ఒక పోస్ట్ పెట్టింది. కాషాయి వస్త్రం ధరించి కాశీ వీధుల్లో వీళ్లంతా వెళ్తూ అక్కడ సాధుసంతువులతో మాట్లాడుతూ ఉన్న పిక్స్ ని, వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంది. ఇక వీళ్ళు ఒక ఫేమస్ స్టార్, డిప్యూటీ సీఎం పిల్లలు అన్న ఆలోచన లేకుండా చాలా సింపుల్ గా వెళ్ళిపోతూ కాశీ యాత్రను ఎంజాయ్ చేస్తున్నారు. రేణు దేశాయ్ కి మూగ జీవాలంటే ఎంత ప్రేమతో ఉంటుందో అంతే దైవ భక్తి కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here