కరోనాకు పుట్టిల్లైన చైనాలో ఇప్పుడు అంత కంటే ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. కరోనాలాగే ఇది మనుషుల నుంచి మనుషులకు అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దీని వ్యాప్తి కరోనా వ్యాప్తి వేగంకంటే రెండింతలు ఎక్కువ. చైనాలో పుట్టిన కరోనా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉసురు తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా కల్లోలం నుంచి కోలుకుని ప్రపంచం గాడిన పడుతోంది. అంతలోనే అంతకంటే భయంకరమైన వైరస్ చైనాలో వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచం గడగడలాడిపోతోంది.

ఈ కొత్త వైరస్ పేరు హ్యుమన్ మెటానియా వైరస్(హెచ్ఎమ్ వీవీ). దీని లక్షణాలు కూడా అచ్చం కరోనా లక్షణాల్లాగానే ఉంటాయి. అయితే కరోనా కంటే ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. తుమ్ము, దగ్గు, జలుబు, లాలాజలం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో  ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. కరోనా కంటే ఎక్కువ ప్రాణాంతకమని వైద్యులు చెబుతున్నారు.   ఈ వైరస్ కు ప్రస్తుతం ఎలాంటి చికిత్సా లేదు. లక్షణాలను బట్టే చికిత్స అందిస్తున్నారు.

చైనాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ఆస్పత్రి పాలయ్యారు.  దీంతో చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కరోనా నాటి పరిస్థితుల్లో విధించినట్లే లాక్ డౌన్ విధించే యోచన కూడా చైనా ప్రభుత్వం చేస్తున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here