న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా గోవాలో ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెంకు చెందిన యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళతే.. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బొల్లా రవితేజ (28) అనే బాధితుడు గత శనివారం ఏడుగురు స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు గోవా వెళ్లాడు.
సోమవారం రాత్రి, విందు కోసం మెరీనా బీచ్ షాక్ రెస్టారెంట్‌కు వెళ్లే ముందు బృందం కలంగుట్ బీచ్‌లో గడిపారు. అక్కడ మహిళా కొలీగ్ రెస్టారెంట్‌లో అధిక ధరలపై ప్రశ్నించడంతో సమస్య మొదలైంది. దీంతో రెస్టారెంట్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
రెస్టారెంట్ యజమాని కుమారుడు సుబెత్ సిల్వీరా మహిళతో అనుచితంగా ప్రవర్తించడంతో వివాదం తీవ్రమైంది.వాగ్వాదం మధ్య కొందరు సిబ్బంది రవితేజపై కర్రలతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here