జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  రిషిక్ కెమికల్ గోడౌన్ లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి . దూలపల్లిలో జరిగిన ఈ ప్రమాదం వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  ప్రమాదానికి ఇంకా కారణాలు తెలియరాలేదు.   మంటలను ఆర్పివేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మంటలు ఆగడం లేదు. భారీ శబ్దంతో పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదం వల్ల దూలపల్లిలో ట్రాఫిక్  స్థంభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here