ఆర్టీసీ డ్రైవర్లు విమానాలను నడుపుతున్నట్లు ఫీలవుతున్నారు. అతివేగంగా బస్సుల్ని నడుపుతున్నారు. ప్రయాణీకుల భద్రతను ఏమాత్రం వారు లెక్క చేయట్లేదు. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఓవర్ స్పీడుతో పాటు మరో బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో ఓ ప్రయాణీకుడి ప్రాణాల మీదకు తెచ్చాడు.
ముందు పోతున్న బస్సును దాటుకుని వెళ్లేందుకు చిన్న పాటి సందు నుంచి బస్సును పోనిచ్చాడు. అయితే ముందు వెళ్తున్న బస్సును ఎక్కేందుకు వచ్చిన ప్రయాణీకుడిని కూడా గమనించకుండా బస్సును పోనిచ్చాడు. అంతే ఆ ప్రయాణీకుడు రెండు బస్సులకు మధ్య చిక్కుకున్నాడు.
కానీ ప్రాణాపాయం నుంచి ఆ వ్యక్తి తప్పించుకున్నాడు. ఇరు బస్సుల మధ్య చిక్కుకున్న ఆ వ్యక్తి ఆ ఘటన నుంచి తప్పించుకుని ఏమీ జరగనట్లు పక్కకుపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో సదరు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. అతనిని వెంటనే సస్పెండ్ చేయాలని నెటిజన్లు మండిపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here