ఏ క్యారక్టర్ నైనా అవలీలగా పోషించే అతి తక్కువ మంది హీరోల్లో విక్టరీ వెంకటేష్(Venkatesh)ఒకరు.మూడున్నర దశాబ్దాల నుంచి అప్రహాతీతంగా సాగుతున్న తన  సినీ ప్రయాణంలో వెంకీ మామ చూడని హిట్ లేదు.ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి.ఇక అభిమాన ఘనం కూడా లక్షల్లోనే ఉంటారు.తన అప్ కమింగ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)ఈ నెల 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా 3000 మంది అభిమానులు వెంకటేష్ ని కలవడానికి రాగా ఎక్కడ విసుగు అనేది లేకుండా వెంకీ ఎంతో ఓపిగ్గా ఫోటోలు ఇవ్వడం జరిగింది.మొదటి నుంచి కూడా వెంకటేష్ కి అభిమానులంటే ఎంతో ఇష్టం.1996 లో వచ్చిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో  ప్రియురాలు రిలీజ్ టైం లో తెనాలికి చెందిన అభిమాని ఒకరు కత్తి పోట్లకి గురైతే వెంకటేష్ అతన్ని పరామర్శించి కొంత  అమౌంట్ ని కూడా ఇవ్వడం జరిగింది.

ఇక సంక్రాంతి వస్తున్నాం మూవీ మీద వెంకటేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే రిలీజైన టీజర్,సాంగ్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా కొత్తగా ఉండి మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూసేలా చేస్తున్నాయి.ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా చేస్తుండగా అనిల్ రావిపూడి(Anil ravipudi) దర్శకుడుగా వ్యవరిస్తున్నాడు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు(Dil raju)నిర్మిస్తుండగా భీమ్స్ సిసోరియా సంగీతాన్ని అందించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here