ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి గ్రమంలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఏటా వేడుకగా, ఘనంగా నిర్వహించే రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పంగుడగా ప్రకటించింది. తొలి సారిగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న రథ సప్తమి పండుగను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ ఏర్పాట్లపై కలెక్టర్ తన కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

రథ సప్తమి వేడుకల కోసం లోగో రూపకల్పనకు ఔత్సాహికులను ఈ సందర్భంగా కలెక్టర్ ఆహ్మా నించారు. ఈ వేడుకలకు ప్రత్యేక లోగో రూపకల్పనకు ఔత్సాహికులను ఆహ్వానించారు.  రథ సప్తమి పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆ రోజు సూర్యనమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే శ్రీకాకుళంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళంలో శోభాయాత్ర నిర్వహిస్తారు.  లక్షలాది భక్తులు తరలి వచ్చే ఈ వేడుకలకు పార్కింగ్, లేజర్ షో, నమూనా దేవాలయాల ప్రదర్శన, సీసీ కెమెరాలు, మంచినీటి సౌకర్యం, ప్రసాదాల కౌంటర్లు, రవాణా సౌకర్యాలు, వసతి సౌకర్యాలు వంటి అన్ని అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో విస్తృతంగా చర్చించారు.  రథసప్తమిని తొలిసారిగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకూ తావులేకుండా  విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here