బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. జాన్వీ ముఖ్యంగా పుట్టినరోజు, సినిమా రిలీజ్‌లు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో వెంకన్న ఆశీస్సుల కోసం తిరుమల కొండకు వెళ్తుంటుంది. తాజాగా శనివారం జాన్వీ వెంకన్నను దర్శించుకుంది.
కొత్త ఏడాది సందర్భంగా స్నేహితుడు శిఖర్ పహారియాతో కలిసి శనివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొంది. ఆలయానికి చేరుకున్న జాన్వీ కపూర్‌కు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.