ప్రముఖ నటుడు బ్రహ్మాజీ(brahmaji)గురించి తెలియని సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు.మూడున్నర దశాబ్దాలపై నుంచి ఎన్నో విభిన్నమైన క్యారెక్టర్స్ ని పోషిస్తూ వస్తున్న బ్రహ్మాజీ హీరోగా కూడా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సింధురం’ అనే మూవీలో నటించి ప్రేక్షకుల మెప్పుని పొందాడు.

రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా బ్రహ్మాజీ ఒక పోస్ట్ చెయ్యడం జరిగింది.’ఎక్కడ చూసిన
బౌన్సర్లు,వాళ్ళ ఓవర్ యాక్షన్ ముందు మా యాక్షన్ కూడా సరిపోవడం లేదు.ఏం చెయ్యాలి,అవుట్ డోర్స్ అయితే పర్వాలేదు.సెట్స్ లో కూడానా అని రాసుకొచ్చాడు.ఈ మధ్య కాలంలో హీరోల బౌన్సర్ల పై పలు రకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ట్వీట్ తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది.

మర్యాద రామన్న,అతడు(athadu)అన్నవరం,గులాబీ(gulabi),స్వయంవరం,వాల్మీకీ,అల వైకుంఠపురం(alavaikuntapuram),భరత్ అనే నేను,మహర్షి,నిజం,శివమణి,సాంబ,భద్ర,మున్నా,పౌర్ణమి,డీ,డాన్ శ్రీను(don srinu),బిజినెస్ మాన్(business man),డమరుకం,బాద్ షా,బలుపు,,ఖడ్గం వంటి  సినిమాలు నటుడుగా బ్రహ్మజీ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here