చాలా కాలం తర్వాత హీరో విశాల్ మీడియా ముందుకు వచ్చారు. అయితే అతన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే గుర్తుపట్టలేనంత మార్పు అతనిలో కనిపించింది. 12 సంవత్సరాల క్రితం సుందర్ సి. దర్శకత్వం వహించిన ‘మదగజరాజు’ చిత్రం ఈ సంక్రాంతికి తమిళ్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం విశాల్ బయటికి వచ్చారు. మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నారు, చేతులు కూడా వణుకుతున్నాయి. అసలు అతనికి ఏమైంది అనే కంగారు అభిమానుల్లో ఎక్కువైంది. ఈ విషయం గురించి విశాల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. గత కొన్నాళ్లుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడని, సినిమా ప్రమోషన్స్ కోసమే బయటికి వచ్చారని చెప్పారు.
గతంలో విశాల్‌కు షూటింగ్ సమయంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. యాక్షన్ సీక్వెన్స్‌లను డూప్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఆ సందర్భాల్లో అతనికి గాయాలు అవుతుంటాయి. ఒక సినిమాలో విశాల్ క్యారెక్టర్ మెల్లకన్ను క్యారెక్టర్ ఉంటుంది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు కళ్ళకు బాగా స్ట్రెయిన్ ఇచ్చారు. దాంతో కంటికి సంబంధించిన నరాలు దెబ్బతిన్నాయి. దాని కోసం చికిత్స తీసుకున్నారు. అయినా అది ఇప్పుడు తిరగబెట్టిందని తెలుస్తోంది. విశాల్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. విశాల్ పరిస్థితి తెలుసుకున్న అభిమానులు తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.