గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఇందులో ఎస్ జే సూర్య కీలక పాత్ర. ఇద్దరి మధ్యే కథ సాగుతుంది. జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఎస్ జే సూర్య అటు పవన్ కళ్యాణ్ గురించి, ఇటు శంకర్ గురించి, రామ్ చరణ్ నటన గురించి పలు విషయాలు మీడియాకు తెలియజేశారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు.
శంకర్ గారితో పని చేయడం ఎలా అనిపించింది?
శంకర్ గారు నన్ను గేమ్ చేంజర్ కోసం పిలిచారు. గేమ్ చేంజర్ సెట్‌లో ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్లాను. నా పర్ఫామెన్స్ చూసి శంకర్ గారు ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమాలో నటనను చూసే నాకు ఇండియన్ 2లో అవకాశం ఇచ్చారు. శంకర్ గారితో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కీ ఉంటుంది. ఆయన ప్రతీ ఒక్క కారెక్టర్‌ను నటించి చూపిస్తారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే స్క్రీన్ మీద మ్యాజిక్‌లా కనిపిస్తుంది.
రామ్ చరణ్ గారితో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?
రామ్ చరణ్ గారు అద్భుతమైన నటులు. ఆయన గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఆ స్టార్‌లో ఓ గొప్ప నటులున్నారు. ఈ చిత్రంలో ఆయన డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎంతో హుందాగా కనిపిస్తారు. అప్పన్న పాత్ర అయితే లైఫ్ టైం గుర్తుండిపోయేలా ఉంటుంది. ఆ అప్పన్న పాత్రలో రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు.