తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం (జనవరి 6) ఉదయం శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటలకు పైగా సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.
ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఇక ఆదదివారం స్వామి వారికి 66 వేల 561 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 18 వేల 647 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 3 కోట్ల 98 లక్షలు వచ్చింది.