హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్ట్‌ 2012లో 72 కి.మీ. దూరం..మూడు కారిడార్లుగా మెట్రో మార్గ్‌ను మార్క్‌ చేశారు. నిత్యం లక్షలాది మంది ప్రమాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది హైదరాబాద్ మెట్రో. ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి, ఎక్కువ దూరం, తక్కువ సమయంలో చేరుకోవడానికి అనుకూలంగా ఉండటంతో మెట్రోకు డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల రద్దీ అంతకంతకు పెరుగుతూ వచ్చింది.

హైదరాబాద్ మెట్రో రైలు కొద్దికాలంలోనే విశేష ప్రజాదరణ పొందింది. ట్రాఫిక్‌, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తూ విభిన్నవర్గాలకు చేరువైంది. ప్రయాణికులకు మెరుగైన రవాణా అందిస్తూ రికార్డ్‌లు క్రియేట్‌ చేస్తోంది. నిత్యం 5 లక్షల మందికి పైగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది హైదరాబాద్ మెట్రో. ఏడేళ్లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ మెట్రో ఎన్నో మైలురాళ్లను క్రియేట్‌ చేసింది.

ఏడేళ్ల క్రితం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైలులో ఇప్పటివరకు 63 కోట్ల మందికి పైగా ప్రయాణం చేశారు. సగటున ప్రతిరోజు 4.75 లక్షల మంది మెట్రో ప్రయాణం చేస్తుండగా.. గరిష్టంగా 5.63 లక్షల మంది ప్రయాణికులుగా జర్నీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మెట్రో ప్రాజెక్టుల్లో ఢిల్లీ మెట్రో ప్రథమ స్థానంలో ఉంటే.. హైదరాబాద్ మెట్రో మూడోస్థానంలో కొనసాగుతోంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టంలో మెట్రో రైళ్లు బ్యాక్ బోన్‌గా ఉంటున్నాయి. ప్రారంభంలో మెట్రో ప్రయాణాలపై అంతగా ఆసక్తి చూపని నగరవాసులు.. ఆ తర్వాత మెల్ల మెల్లగా మెట్రో ప్రయాణం వైపు మెుగ్గు చూపారు. ప్రస్తుతం ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్ మూడు కారిడార్లలో సేవలందిస్తోంది హైదరాబాద్ మెట్రో. ప్రస్తుతం మూడు కారిడార్లలోనూ ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉంటోంది.

హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తూ, వేగంగా ప్రయాణించేందుకు ఎక్కువ శాతం మెట్రోను ఆశ్రయిస్తున్నారు. వీరితోడు ఉద్యోగులు, విద్యార్థులు సైతం ప్రయాణాలకు ఇష్టపడుతున్నారు. దీంతో మెట్రో రైలులో సైతం విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. బిజినెస్ వేళల్లో కనీసం కాలు నిలపలేని పరిస్థితి. ప్రస్తుతం ట్రైన్లలో కూర్చుని ప్రయాణాలు చేసేందుకు ఏమాత్రం అవకాశం దొరకడం లేదు. ఈ క్రమంలోనే మెట్రో కంపార్ట్‌మెంట్ల సంఖ్య పెంచాలని ప్రయాణికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మెట్రో ప్రయాణికుల రద్దీపై రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో కోచ్‌ల సంఖ్యను పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైల్ 3 కోచ్‌లతో నడుస్తోంది. కావున రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు కోచ్‌లను ఏర్పాటు చేయాలన్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మెట్రోను 3 కోచ్‌లతో నడిపేందుకు డిజైన్ చేసినట్లు తెలిపిన మంత్రి.. దాన్ని 6 కోచ్‌లుగా మార్చేందుకు ఫ్లాన్ చేస్తున్నామన్నారు. త్వరలోనే ఆరు కోచ్‌లుగా అప్‌గ్రేడ్ చేసేందుకు మెట్రో అధికారులు, ఎల్ అండ్ టీ యాజమన్యంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కోచ్‌ల పెరిగితే, హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల రద్దీ తగ్గుతుందని, కూర్చొని ప్రయాణించే వీలు కలుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

ఇక మెట్రో సెకండ్ ఫేజ్‌కు కూడా రేవంత్ సర్కార్ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే! రెండో దశలో చేపట్టబోయే పనులపై డీపీఆర్‌ రెడీ అయింది. శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్గం.. పలు ప్రత్యేకతల సమాహారంగా ఉండబోతోంది. ఎయిర్‌పోర్ట్‌ కారిడార్‌లో అండర్‌ గ్రౌండ్ మార్గం నిర్మించేలా ప్రణాళిక రెడీ చేశారు. నాగోల్-ఎయిర్‌పోర్ట్, రాయదుర్గ్-కోకాపేట్, ఎంజీబీఎస్‌-చంద్రాయణగుట్ట, మియాపూర్-పటాన్‌చెరు, ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్, మియాపూర్‌ – పటాన్‌చెరు వరకు అవకాశం ఉన్న చోట డబుల్‌ డెక్కర్‌ నిర్మిస్తారు. రెండో దశలో ప్రతి కిలో మీటరుకు రూ.318 కోట్లు ఖర్చు అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here