తమిళనాడు సరిహద్దు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు పర్యావరణానికి హాని కలిగించే రహస్య డంపింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గుర్తించింది. మేరకు కేరళ ప్రభుత్వానికి కోర్టు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. వ్యర్థాలను వెలికితీయాలని లేదా సురక్షితమైన ప్రాంతాల్లో పారవేయడం కోసం తమిళనాడులోని కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీతో ఒప్పందం కుదుర్చుకోవాలని బెంచ్ కేరళకు సూచించింది.
దక్షణాదిన మరో రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటిదాకా తమిళనాడు – కర్ణాటక మధ్య కావేరి జలాల విషయంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితి నెలకొని ఉన్న విషయం తెలిసిందే..! తాజాగా తమిళనాడు – కేరళ మధ్య మరో వివాదం రాజుకుంది. కొద్ది నెలలుగా రెండు రాష్ట్రాల మధ్య మొదలైన సమస్య, ఇప్పుడు కేంద్రం దాకా వెళ్ళింది. ఇంతకీ కేరళ – తమిళనాడు మధ్య మొదలైన ఆ రచ్చకు కారణం ఏంటో తెలుసుకుందాం..!
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరంగా మారుతున్న విషయం ఏంటంటే మెడికల్ వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం. ఆసుపత్రిలో చికిత్స అనంతరం మిగిలిపోయిన మందులు, సర్జరీ తర్వాత తొలగించిన మానవ అవయవాలు.. ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు వాటిని డిస్పోస్ చేసేందుకు పలు ఏజెన్సీలకు కాంట్రాక్టులు ఇస్తుంటాయి. అయితే ఆ ఏజెన్సీలు మెడికల్ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ వదిలేసి చేతులు దులిపేసుకుంటూ కాసులు దండుకుంటున్నాయి. అలాగే మరికొన్ని ఆస్పత్రులు నేరుగానే ఇలాంటి వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తుంటాయి.
ఇప్పుడు ఇదే అంశమై రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలై రచ్చకు దారితీసింది. కేరళ నుంచి మెడికల్ వేర్దాలు తమిళనాడులోని పలుచోట్ల వదిలేసి వెళ్లిపోవడం చాలా రోజులుగా జరుగుతుంది. కేరళలోని తిరువనంతపురం రీజినల్ క్యాన్సర్ సెంటర్ కు చెందిన ప్రమాదకరమైన వైద్య వ్యర్ధాలను తిరునల్వేలి జిల్లాలోని కొడెక్క నల్లూరు నడుక్క నల్లూరు, పాలవూరు కొండనగరం ప్రాంతాల్లో పడేసి వెళుతున్నట్లు స్థానికులు గుర్తించారు. పలుమార్లు అడ్డు చెప్పినా, ఏం పట్టనట్లు యథావిధిగా వ్యర్ధాలను వదిలి వెళ్తున్నారు.
ఈ విషయంపై స్థానికుల్లో చాలా రోజులుగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతాల్లో నిత్యం ఇదే విధంగా ఆసుపత్రి నుంచి వ్యర్ధాలు పడేసి వెళ్లడంపై అనారోగ్యానికి కారణమవుతుందని స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఆందోళనలు చేపట్టాయి. చాలా రోజులుగా జరుగుతున్న ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించి, కేరళ ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో ప్రస్తావించింది. అయినా మెడికల్ వ్యర్ధాలను పడేయడం అనేది జరుగుతూనే ఉంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసులు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.
ఈ విషయంపై స్థానికుల్లో చాలా రోజులుగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతాల్లో నిత్యం ఇదే విధంగా ఆసుపత్రి నుంచి వ్యర్ధాలు పడేసి వెళ్లడంపై అనారోగ్యానికి కారణమవుతుందని స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఆందోళనలు చేపట్టాయి. చాలా రోజులుగా జరుగుతున్న ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించి, కేరళ ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో ప్రస్తావించింది. అయినా మెడికల్ వ్యర్ధాలను పడేయడం అనేది జరుగుతూనే ఉంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసులు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.
మరోవైపు గ్రీన్ ట్రిబ్యునల్ బోర్డు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని మూడు రోజుల్లో వ్యర్ధాలను తొలగించాలని కేరళ రాష్ట్ర కాలుష్య నియంత్ర మండలిని ఆదేశించింది. డిసెంబర్ 23 లోగా ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్ ఆదేశించింది. ప్రమాదకరమైన వైద్య వ్యర్ధాలను ఇలా పడేసి వెళ్లడంపై చెరువు అనంతపురం క్యాన్సర్ ఇన్సిస్టిట్యూట్పై చర్యలు తీసుకోవాలని కేరళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఫిర్యాదు చేసింది.
గ్రామీణ ప్రాంతాలకు సమీపంలో వ్యర్ధాలు వేయడంతో స్థానికులు రోగాల పాలవుతున్నారు. అటు అటవీ ప్రాంతంలో ప్రమాదకరమైన వ్యర్ధాలను పడేయడంతో వన్యప్రాణులకు సైతం ప్రమాదం ఏర్పడుతోంది. ఇదే విషయమై తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కేరళ ప్రభుత్వం తీరుపై సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేసింది. కేరళ నుంచి తమిళనాడులో వ్యర్ధాలను పడేసిన అంశంపై అన్ని ఆధారాలు ఉండడంతో కేరళ ప్రభుత్వం దీనిపై గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. చెరువు అనంతపురం క్యాన్సర్ ఇన్సిస్టిట్యూట్ చేసిన నిర్లక్ష్యానికి కేరళ ప్రభుత్వం సమాధానం చెప్పుకునే పరిస్థితి రావడంతో కేరళలో విపక్షాలన్నీ ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నాయి.