బీహార్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ బాలుడు కేవలం ఐదు గంటల్లో కోటీశ్వరుడిగా మారాడు. అలా.. ఇలా కాదు.. లచ్చిందేవి అతడి తలుపు గట్టిగా కొట్టింది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ఆ అబ్బాయ్ ఓ నిరుపేద కుటుంబానికి చెందినవాడు. తల్లి ఓ రూ. 500 విత్‌డ్రా చేసుకుని రమ్మని ఏటీఎంకు పంపించింది. దీంతో బాలుడు సరాసరి రయ్యిమని ఏటీఎంకి వెళ్లాడు. ఇతరుల సాయంతో డబ్బులు డ్రా చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. అనంతరం ఖాతాలోని బ్యాలెన్స్ చెక్ చేయించగా.. ఆ విద్యార్ధితో పాటు అతడికి సాయం చేసిన వ్యక్తి కూడా దెబ్బకు షాక్ అయ్యారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న సైఫ్ అనే పిల్లాడు.. కొన్ని క్షణాల్లో కోట్లకు అధిపతిగా మారాడు. తన తల్లి చెప్పిందని ఏటీఎంకు రూ. 500 విత్ డ్రా చేయడానికి వచ్చాడు. డబ్బు విత్‌డ్రా చేశాక.. బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేయగా.. ఖాతాలో రూ. 87 కోట్లు చూసి సదరు బాలుడు, అతడికి సాయం చేసిన వ్యక్తి దెబ్బకు షాక్ అయ్యారు.
వెంటనే ఈ సమాచారాన్ని సైఫ్ ఇంటికి వచ్చి.. తన తల్లికి అందించాడు. అసలు ఎందుకిలా జరిగిందో సైఫ్‌కి అర్ధం కాకపోగా.. అతడి తల్లి మాత్రం ఈ అంశాన్ని గ్రామంలో ఉన్న మరో వ్యక్తికి చెప్పింది. సదరు వ్యక్తి సంబంధిత బ్యాంక్‌కి వెళ్లి సిబ్బందికి చెప్పడంతో.. కేవలం 5 గంటల్లోనే రూ. 87 కోట్లను సైఫ్ ఖాతా నుంచి తొలగించారు. చివరికి అతడి ఖాతాలో కేవలం రూ. 532 మాత్రమే ఉన్నాయి. కాగా, ఈ అంశంపై సైఫ్ కుటుంబం ఎలాంటి అధికారిక ఫిర్యాదు చేయలేదు. డబ్బులు ఎవరు పంపారు.? ఎక్కడి నుంచి పంపారు.? అనేది తెలియలేదు. నార్త్ బీహార్ గ్రామీణ బ్యాంకులోని ఒక విద్యార్థి ఖాతాలోకి ఇంత మొత్తం ఎలా వచ్చిందని, కొద్ది గంటల్లోనే ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేయడం, అతని ఖాతా సస్పెండ్ చేసి ఆరా తీయడం మొదలుపెట్టారు బ్యాంక్ అధికారులు.