ఈ ఘటనలో ఒక చిన్నారితో పాటు ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి 50 ఏళ్ల సౌదీ అరేబియా వ్యక్తి తలేబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రకటనలో పేర్కొంది.
జర్మనీలో క్రిస్మస్ వేడుకల సందర్బంగా దారుణం చోటు చేసుకుంది. జర్మనీలోని మగ్డెబర్గ్ ప్రాంతలోని క్రిస్మస్ మార్కెట్లో కారు బీభత్సం సృష్టించింది. కిస్మస్ మార్కెట్లో పాదచారులపైకి అతి వేగంగా కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పాదచారులను ఢీకొట్టిన తరువాత కారు 400 మీటర్లు దూసుకెళ్లింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
మాగ్డేబర్గ్ నగరంలోని క్రిస్మస్ మార్కెట్లో ఈ ఘోర సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఓ కారు అదుపుతప్పి అక్కడి ప్రజల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక చిన్నారితో పాటు ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి 50 ఏళ్ల సౌదీ అరేబియా వ్యక్తి తలేబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిందితుడు బీఎమ్‌డబ్ల్యూ కారును అద్దెకు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బీఎండబ్ల్యు కారు డ్రైవ్ చేసిన వ్యక్తి డాక్టర్ సక్సోనీ అన్హల్ట్గా(50) గుర్తించారు. సౌదీ అరేబియాకు చెందిన సక్సోనీ 2006 నుంచి జర్మనీలో ఉంటున్నాడని చెప్పారు. మరోవైపు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ ఘటనను ఖండించింది. జర్మనీలో జరిగిన ఈ హింసాత్మక ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రకటనలో పేర్కొంది.