Ravichandran Ashwin Wife Prithi Narayanan: టీమిండియా స్టార్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ గబ్బా టెస్ట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో అశ్విన్ భార్య సోషల్ మీడియా పోస్ట్‌లో ఎంతో ఎమోషనల్ అయ్యారు. గత రెండు రోజులుగా తనకేం తోచడం లేదంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో సుధీర్ఘంగా పోస్ట్‌ రాసుకొచ్చారు.

టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) బ్రిస్బెన్ టెస్ట్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, టెస్టుల్లో అశ్విన్ కీలక బౌలర్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత అంతా షాక్ అయ్యారు. గబ్బా టెస్టు తర్వాత రోహిత్‌శర్మతో కలిసి అశ్విన్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నట్లు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అశ్విన్ ఇలాంటి షాకింగ్ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? అంటూ చాలామంది సోషల్ మీడియాలో ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

ఇదే క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్‌ సోషల్ మీడియా వేదికగా ఓ కీలక స్టేట్‌మెంట్‌తో షాక్ ఇచ్చారు. ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసిన ఆమె, ‘గత రెండు రోజులుగా నాకేం తోచడం లేదు. ఏం చెప్పాలో అర్థ కావడం లేదు. నా లైఫ్ పార్టనర్‌ గురించి చెప్పాలా, నాకు ఇష్టమైన క్రికెటర్‌ గురించి మాట్లాడాలా? అసలు ఏం అర్థం కావడం లేదు’’ అంటూ చెప్పుకొచ్చారు.

కాగా, రిటైర్మెంట్ చేసిన తర్వాత భారత్‌కు తిరిగొచ్చిన అశ్విన్‌కు ఘనంగా స్వాగతం తెలిపింది. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు సమంగా నిలిచాయి. తొలి టెస్ట్‌లో భారత్ గెలిస్తే, రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. మూడో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. దీంతో డిసెంబర్ 26 నుంచి నాలుగో టెస్ట్ జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here