బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో నందమూరి బాలకృష్ణ మంచి జోరు మీద ఉన్నారు.దీంతో ఆయన అప్ కమింగ్ మూవీ ‘డాకు మహారాజ్’పై బాలకృష్ణ అభిమానుల్లోను,ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కాబోతున్న ఈ మూవీలో బాలకృష్ణ సరసన ప్రగ్య జైస్వాల్,శ్రద్ద శ్రీనాధ్ లు హీరోయిన్లుగా చేస్తుండగా,చిరంజీవికి వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ ని అందించిన బాబీ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది.

రీసెంట్ గా చిత్ర బృందం ఒక ప్రెస్ మీట్ ని నిర్వహించింది.ఒక రిపోర్టర్ నిర్మాత నాగవంశీతో చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి తరలి వెళ్తుందనే వార్తలు వస్తున్నాయి కదా అని అడగటం జరిగింది. అప్పుడు ఆయన మాట్లాడుతు నేను డబ్బు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఏపీకి వెళ్లి ఏం చేస్తాను.పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే ఆయన్ని కలిస్తే ఏపీ ప్రభుత్వం నుంచి సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తామని మాతో ఫస్ట్ మీటింగ్‌లోనే చెప్పాడు.ఆ విధంగా అయన చేసాడు కూడా. ఆ సపోర్ట్ అలాగే ఉంటుందని భావిస్తున్నాం.సంక్రాంతి సినిమాలకు పెయిడ్‌ ప్రీమియర్స్ అవసరం లేదు.తెల్లవారుజామున 4.30కి సినిమా పడితే చాలు.ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్ రాజు అమెరికాలో ఉన్నారు.ఆయన  హైదరాబాద్‌ వచ్చాక అందరం  కలిసి డిసైడ్‌ చేసి మాట్లాడుతాం.పైగా ఆయన సినిమా అందరి కంటే ముందు కాబట్టి  ఏం తేలుస్తారో చూద్దాం.సీఎంగారు చెప్పేశారు ఓకే! చంద్రబాబుగారిని, పవన్‌గారిని కలుద్దామని ఎవరూ చెప్పలేదని చెప్పడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here