సంధ్య థియేటర్ లో సంభవించిన రేవతి అనే మహిళ మరణానికి సంబంధించిన కేసులో అల్లుఅర్జున్(allu arjun)వైపు నుంచి ఒక వర్షన్ ఉంటే,పోలీసుల వర్షన్ మరోలా ఉంది.మీడియా పరంగా కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా న్యూస్ వస్తుంటే జాతీయ మీడియాలో మరో రకంగా ప్రసారమవుతూ ఉంది.వాటిపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతు నేషనల్ మీడియా అమ్ముడుపోయిందనే సంచలన వ్యాఖ్యలు చెయ్యడం జరిగింది.
ఇప్పుడు తన మాటలపై సివి ఆనంద్ ఎక్స్ వేదికగా స్పందిస్తు అల్లు అర్జున్ వ్యవహారంలో వారు అడిగిన ప్రశ్నలకు కోపంలో నేషనల్ మీడియా అమ్ముడుపోయిందని మాట్లాడాను.అందుకు నేషనల్ మీడియాకు క్షమాపణలు చెప్తున్నానని ఆయన ట్వీట్ చేసాడు.