నట సింహం నందమూరి బాలకృష్ణ(balakrishna)మొదటి కూతురు బ్రాహ్మణి,అల్లుడు నారా లోకేష్ ల కొడుకు పేరు దేవాన్ష్(devansh)అనే విషయం తెలిసిందే.చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో దేవాన్ష్ ప్రపంచ రికార్డు సాధించాడు.9 ఏళ్ల నారా దేవాన్ష్ వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ 175 పజిల్స్ కి సంబంధించి ఈ రికార్డుని అందుకున్నాడు.వ్యూహాత్మకమైన ఆటతీరు,థ్రిల్లింగ్ ప్రదర్శనతో ఈ రికార్డ్‌లో దేవాన్ష్ క్రమక్రమంగా సవాలు చేసే చెక్‌మేట్ పజిల్‌ల క్రమాన్ని పరిష్కరించాడు.ప్రసిద్ధ చెస్ సంకలనం నుండి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు.
ఇక దేవాన్ష్ ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుండిఅధికారిక ధృవీకరణను అందుకున్నందుకు నారా కుటుంబం తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది.తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాంశ్ ఈ రికార్డును సాధించగలిగాడు.ఇదే కాకుండా దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1నిమి 43సెకన్లలో పూర్తి చేసాడు. 9 చెస్ బోర్డ్‌లను కేవలం 5నిమిషాల్లో అమర్చాడు, మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. దేవాన్ష్ కోచ్ పేరు కె. రాజశేఖర్ రెడ్డి.