ల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీని పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియోటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఆంటోనీని ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోనికి తీసుకున్నారు.
అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పని చేస్తున్న ఆంటోనీని అరెస్టు చేయడానికి ముందు దాదాపు రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసు స్టేషన్ లో పోలీసులు విచారించారు. ఆ విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగానే ఆంటోనీని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అల్లు అర్జున్ బౌన్సర్ల టీమ్ ఆర్గనైజర్ ఆంటోనీని అరెస్టు చేయడం, అల్లు అర్జున్ ను సుదీర్ఘంగా విచారించడంతో ఇప్పుడో, ఇహనో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.