సోష‌ల్ మీడియా ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న అష్షు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  సోష‌ల్ మీడియా సెలబ్రెటీతోనే ఆమె బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. ఆ త‌ర‌వాత చివ‌రివ‌ర‌కూ హౌస్ లో కొన‌సాగి ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. ఇక ఆర్జీవీకి ఇష్టమైన వారిలో అష్షు కూడా ఒకటి. ఇక ఒక చిట్ చాట్ టైంలో అష్షు కొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్స్ చెప్పింది. “నిజానికి నాకు గై ఫ్రెండ్స్ ఎక్కువ. ఐతే చుట్టాలు ఎవరైనా ఒక అబ్బాయితో నన్ను ఒకట్రెండు సార్లు చూసారు అంటే.. ఒకే వీళ్ళ మధ్య ఏదో ఉంది అని వాళ్ళు ఫిక్స్ ఐపోతారు. ఇక వీళ్లకు పెళ్లి చేసేయాలి అనుకుంటారు. ఐతే కొంతమంది అబ్బాయిలతో ఇలా పెళ్లి ఫిక్స్ చేయాలి అన్నప్పుడు మాత్రం ఆ అబ్బాయిల మీద ఇరిటేషన్ వస్తుంది. కొందరు పెళ్ళికి కొందరు ఫ్రెండ్ షిప్ కి ఉంటారు.

ఇంకొంతమంది అబ్బాయిలతో అలా పెళ్లి ఫిక్స్ అంటే మాత్రం అబ్బా..అంటే అన్నారు కానీ ఇది నిజమైతే బాగుండును అనిపిస్తుంది. కానీ ఆ విషయాన్ని వాళ్లకు చెప్పలేము కానీ లోపల్లోపల ఫీలింగ్ ఉంటుంది. ఆర్జే సూర్య లాంటి వాళ్ళతో అలా అనుకుంటే మే బి బాగుంటుంది..ఇక సెలబ్రిటీ క్రష్ విషయానికి వస్తే ఆయన ఎం చేసినా బాగుంటుంది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన హ్యుమానిటీ అంటే ఇష్టం.. ఆయన మంచితనం ఇష్టం..ఫైనల్ గా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం..ఆయనేం చేసినా నచ్చుతుంది. ఒక సారి మా కుక్కపిల్ల తప్పిపోయింది. దాని కోసం నాలుగు గంటల సేపు ఒక అడవిలాంటి ప్రదేశంలో వెతికాం కానీ చివరికి అదే నన్ను వెతుక్కుంటూ వాసన పసిగట్టి నా గది డోర్ దగ్గరకు వచ్చి నిలబడింది. ఇక అప్పుడు వచ్చిన ఆనందం మాట్లల్లో చెప్పలేను.  ” అంటూ అష్షు రెడ్డి చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here