ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ‘శంబాల’ చిత్రాన్ని ఆది సాయి కుమార్ చేస్తున్నారు. ‘ఏ’ యాడ్ ఇన్‌ఫినిటిమ్ ఫేమ్ డైరెక్టర్ యుగంధర్ ముని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి ఖర్చులకు రాజీ పడకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఆది సాయి కుమార్ పుట్టినరోజు సందర్భంగా శంబాల ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ఆది పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సైకిల్ మీద హీరో మంటల్లోంచి రావడం, ఆకాశం ఎరుపెక్కి కనిపించడం చూస్తుంటే.. ఏదో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
శంబాల చిత్రంలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటించనున్నారు. సూర్య 45వ చిత్రంలో భాగమైన శ్వాసిక కీలక పాత్ర పోషిస్తుండగా.. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here