ఆట సందీప్ భార్య జ్యోతిరాజ్ సందీప్ అప్పుడప్పుడు కొన్ని మోటివేషనల్ వీడియోస్ కూడా  చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక వీడియో చేసింది. రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలుసు. ఒక ఫ్యాన్ ప్రాణమే పోయింది. అలాంటి ఫ్యాన్స్ కి జ్యోతి రాజ్ ఒక వార్నింగ్ లాంటి మెసేజ్ ఇచ్చింది. “ఫ్యాన్స్ ఇప్పటికైనా మారండి. పిచ్చి ప్రేమ పెంచుకున్న ఈ ఫ్యాన్స్ కి ఈ వీడియో. మీరు తలుచుకుంటే నార్మల్ పర్సన్ ని కూడా పెద్ద సెలెబ్రిటీని చేస్తారు..మీరు తలుచుకుంటే ఎంత తోపు హీరోని కానీ హీరోయిన్ ని ఐనా కూడా ఓవర్ నైట్ జైలుకు కూడా పంపిస్తారు. మీ పిచ్చి అభిమానం ఎప్పుడూ ఎవరికీ ఇబ్బందికరంగా ఉండకూడదు. ఇకముందైనా మారండి. మీ హీరోస్ ని హీరోయిన్స్ ని చూసి మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. వాళ్ళు కూడా మన లాంటి మనుషులే..మన తల్లితండ్రుల కన్నా గొప్ప కాదు.హీరోస్ హీరోయిన్స్ ఏమీ దేవుళ్ళు కాదు. సినిమా హీరోస్ గ్రేట్ కానీ వారిని అభిమానిద్దాం.. సినిమా వాళ్ళ ప్రీ రీలీజ్ ఈవెంట్స్ కి కానీ ఏ ఫంక్షన్స్ కైనా కొంచెం రెస్పాన్సబుల్ గా ఉందాం. సినిమా వచ్చిన రోజునే చూడాలి అన్న రూలేం లేదు. థియేటర్ లో మూవీ ఫస్ట్ డేనే చూడాలన్న పిచ్చి అభిమానంతో ప్రాణాలు పోగొట్టుకోవద్దు వేరే వాళ్ళ ప్రాణాలను తీయొద్దు. ఈ ప్రేమను, పిచ్చిని మంచికి వాడదాం” అంటూ పిచ్చి ఫ్యాన్స్ కోసం ఒక మోటివేషనల్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ ఉంటె ఇంకొంతమంది మాత్రం ఫ్యాన్స్ మారరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here