బుల్లితెర మీద సోనియా సింగ్, పవన్ సిద్దు జోడి ఏ షో ఐనా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ పక్కా అందిస్తూ ఉంటారు. వీళ్ళు కలిసి యూట్యూబ్ వీడియోస్ చేస్తారు అలాగే షార్ట్ ఫిలిమ్స్ , మూవీస్ , బుల్లితెర షోస్ లో కనిపిస్తూ ఉంటారు. సోనియా సింగ్ కి విరూపాక్ష మూవీతో మంచి పేరు రాగా పవన్ సిద్దుకి అర్దమయ్యిందా అరుణ్ కుమార్ సెకండ్ సిరీస్ తో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఢీ జోడి షోకి వస్తున్నారు. అలాంటి వీళ్ళతో జరిగిన చిట్ చాట్ లో కొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్స్ ని చెప్పారు. “ముందు పవన్ సిద్ధునే ప్రొపోజ్ చేసాడు. నా లైఫ్ లోకి సిద్దు  రావడం బిగ్ సర్ప్రైజ్.. నా లైఫ్ లో సెలబ్రిటీ క్రష్ ముందు కానీ ఇప్పుడు కానీ ఎవరూ లేరు. సిద్దు ఒక్కడే నా క్రష్. నాకు సిద్దు అంటేనే ఇష్టం. అతనిలో నచ్చని క్వాలిటీ ఏదీ లేదు. హీరో హీరోయిన్స్ గా ఏదైనా మూవీని రిక్రియేట్ చేయాల్సి వస్తే సౌందర్య గారు నటించిన పవిత్ర బంధం మూవీ చేస్తా. మేము గొడవపడినప్పుడు నేనే గెలుస్తా. బ్రేకప్ అని నా పార్టనర్ చెప్తే గనక  నెక్స్ట్ సెకండ్ చంపేస్తాను. ఒకసారి నా మూవీ షూటింగ్ నైట్ 2 కి పూర్తయ్యింది. అప్పుడు లిఫ్ట్ దగ్గర నిలబడ్డాను. అక్కడ ఉన్న సిద్దు నన్ను ఒక్కసారిగా దెయ్యంలా చూసాడు. అతనిలోకి ఏదో శక్తి వచ్చేసిందని భయపడి లాగిపెట్టి చెంప పగలగొట్టా . అది కూడా విరూపాక్ష రిలీజయిన కొత్తలో. అలా కొట్టేసరికి సిద్దు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. తర్వాత అనిపించింది ఇప్పుడు నన్ను తిడతాడా ఏంటా అని. కానీ ఏమీ అనలేదు. ఇక  సెలెబ్రిటీ కపుల్ తో మమ్మల్ని పోల్చుకోవాల్సి వస్తే సూర్య అండ్ జ్యోతిక గారిలా ఉండాలని అనుకుంటా.” అంటూ సోనియా సింగ్ చెప్పుకొచ్చింది. తర్వాత పవన్ సిద్దు తన అభిప్రాయాలను చెప్పాడు. “మాది మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో అలా రిలేషన్  లవ్ లోకి వెళ్ళిపోయింది.

ఇద్దరం కలిసి చూసిన ఫస్ట్ ఫిలిం జెర్సీ..సోనియానే ఎక్కువగా సర్ప్రైజ్ లు ఇస్తుంది. నా సెలబ్రిటీ క్రష్ తమన్నా. సోనియానే కుకింగ్ బాగా చేస్తుంది. నాకు కోపం ఎక్కువ. బాగా అరుస్తా ఉంటా. అన్ని అర్ధం చేసుకుని భరిస్తుంది. హీరో హీరోయిన్స్ గా ఏదైనా మూవీని రిక్రియేట్ చేయాల్సి వస్తే బిజినెస్ మ్యాన్ మూవీని చేస్తా. నేను ఏడుస్తూ ఉంటా బాధొచ్చినప్పుడు. మగాళ్లు ఏడుస్తారని బయటకు చెప్పరు కానీ నేను ఏడుస్తాను. సోనియా నీకు చంపేంత ప్రేమ ఉంటే నాకు చచ్చిపోయేంత ప్రేమ ఉంది. ఇక సెలెబ్రిటీ కపుల్ తో మమ్మల్ని పోల్చుకోవాల్సి వస్తే రీతేష్ దేశ్ ముఖ్ – జెనీలియాలా ఉండాలనుకుంటా” అని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here