గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)నుంచి సుమారు రెండు సంవత్సరాల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్న మూవీ గేమ్ చేంజర్(game changer).సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కాబోతున్న ఈ మూవీకి శంకర్(shankar)దర్శకుడు.దీంతో గేమ్ చేంజర్ పై మెగా అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.పైగా తమన్ సంగీత సారధ్యంలో ఇప్పటికే రిలీజైన నాలుగు పాటలు,టీజర్ ఒక రేంజ్ లో ఉండటంతో అంచనాలు అంబరాన్ని తాకాయని కూడా చెప్పవచ్చు.

రీసెంట్ గా చరణ్ అభిమాని ‘రిప్ లెటర్’ అనే టైటిల్ ని హెడ్డింగ్ గా పెట్టి  గేమ్ చేంజర్ టీం కి ఒక లెటర్ రాయడం జరిగింది.’గౌరవనీయులైన గేమ్ చేంజర్ గారికి నేను అనగా ఈశ్వర్ చరణ్ అన్న ఫ్యాన్ చింతిస్తూ రాయునది ఏమనగా,సినిమాకి ఇంకా పదమూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది.మరి మీరు ఇంకా ఎలాంటి ట్రైలర్ అప్ డేట్ ఇవ్వలేదు.కనీసం అభిమానుల ఎమోషన్స్ ని కూడా పట్టించుకోవటంలేదు.ఈ నెలాఖరుకల్లా,ట్రైలర్ అప్ డేట్ ఇవ్వకపోతే,న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చెయ్యకపోతే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానని తెలియచేస్తున్నాని రాసుకొచ్చాడు.ఇప్పుడు ఈ లెటర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.మరి ఈ విషయంపై ప్రొడ్యూసర్ దిల్ రాజు(dil raju)గాని,రామ్ చరణ్ గాని ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇక గేమ్ చేంజర్ లో కియారా అద్వానీ(Kiara Advan)హీరోయిన్ గా చేస్తుండగా అంజలి, శ్రీకాంత్,ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here