విజయం అంత సులువుగా ఎవరినీ వరించదు. జీవితంలో సక్సెస్ సాధించడం అనేది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మీదనే ఆధారపడి ఉంటుంది. చాలా వరకు సొంతంగా ఎదిగి లక్షాధికారులు,  కోటిశ్వరులు అయిన వారి జీవితాలను పరిశీలిస్తే వారు సమయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో తెలుస్తుంది. సక్సెస్ ఫుల్ పర్సన్స్ ను ఇతరుల కంటే భిన్నంగా ఉంచేది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే గుణమే..  ఇంతకీ సక్సెస్ ఫుల్ పర్సన్స్ ఖాళీ సమయాన్ని ఎలా వినియోగించుకుంటారంటే..

సక్సెస్ ఫుల్ పర్సన్స్ తమకు లభించే ఖాళీ సమయాన్ని బంధాలు నిలబెట్టుకోవడం కోసం ఎంచుకుంటారు.  స్నేహితులు,  కుటుంబ సభ్యులు,  ఆత్మీయులతో మాట్లాడటం చర్చలు చేయడం,  ఆలోచనాత్మకంగా మాట్లాడటం ద్వారా సక్సెస్ ఫుల్ పర్సన్స్ కొత్త ఆలోచనలకు, కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దీని వల్ల వారు ఎదుగుతూనే ఉంటారు.

పుస్తకాలు చదవడం,  కొత్త విషయాల గురించి అణ్వేషించడం, అధ్యయనం చేయడం,  తమకు ఉన్న ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించడం,  గొప్ప వ్యక్తుల మాటలు, ఇంటర్వ్యూలు చదవడం, చూడటం మొదలైనవి చేయడం ద్వారా కొత్త విషయాలను తెలుసుకుంటారు. వాటిని అవసరమైన మెరకు తమ జీవితంలో వినియోగించుకుంటారు.

ప్రతి ఒక్కరికి కొన్ని అభిరుచులు ఉంటాయి. అయితే సక్సెస్ ఫుల్ పర్సన్స్ మాత్రం పెయింటింగ్,  సంగీతం,  గార్డెనింగ్, వంట వంటి వాటిని ఇష్టమైన అభిరుచులుగా మార్చుకుంటారు. వీటిలో సమయం గడుపుతారు.  ఇలా వారు గడిపే సమయంలో వారికి కొత్త ఆలోచనలు పుడతాయట.  మెరుగైన ప్రణాళికలకు బీజం పడుతుందట.

ఆరోగ్యంగా ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం.  ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో మంచి స్థాయికి వెళ్లినా దాన్ని అస్వాదించగలగరు. అందుకే యోగ,  జాగింగ్.  స్విమ్మింగ్ వంటి కార్యాచరణలతో పాటు జిమ్ చేయడం ఇంట్లోనే వ్యాయామం చేయడం వంటివి తమ రోజులో బాగం చేసుకుంటారు.

కళల పట్ల ఆసక్తి ఉన్నవారు,  ఏదైనా కళలో ప్రవేశం ఉన్నవారి ఆలోచనలు చాలా మెరుగ్గా ఉంటాయి.  వీరి ఆలోచనా పరిధి విస్తృతంగా ఉంటుంది.

సామాజిక విషయాల పట్ల ఎప్పుడూ చురుగ్గా ఉంటారు.  సామాజిక కార్యకలాపాలలో భాగస్వాములు అవుతుంటారు. వ్యక్తి వేగంగా విజయం వైపు నడవడానికి ఇవి చాలా సహాయపడతాయి.

కొత్త ప్రదేశాలను సందర్శించడం చాలామంది అలవాటు.   ఇది చాలా మందికి కొత్త ఆలోచనలను,  కొత్త అనుభవాలను ఇస్తుంది.  ఈ అనుభవాల నుండి కొన్ని కార్యాచరణలు రూపుదిద్దుకుంటాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here