పిల్లల పెంపకంలో లోపాలు జరిగితే అది తల్లిదండ్రుల బాధ్యతే. ముందుగా గురువులు పిల్లలని మంచి శిక్షకులుగా తీర్చిదిద్దాలి. ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు సరైన మార్గంలో తీర్చిదిద్దాలి. అలా కాకుండా తల్లి దండ్రులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే సంథ్య థియేటర్ సంఘటనలు వంటివి జరుగుతాయని సినీరంగ ప్రముఖులు తెలియజేస్తున్నారు. ఈరోజు తెలుగు టీవీ, చలన చితరంగ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కొందరు మాట్లాడుతూ, నటీనటులకు అభిమానులుండవచ్చు. కానీ మరీ మూర్ఖంగా వుండకూదని విశ్లేషించారు. పుష్ప 2 ఉదంతం దేశాన్ని కదలించింది. నేడు కన్నడ నటుడు యష్ కూడా తన అభిమానులనుద్దేశించి ఆరోగ్యం, భ్రదత అవసరం అని చెప్పారు. గతంలోనే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాన్ వంటివారు కూడా ముందుగా తల్లిదండ్రులు మీకు హీరో. బాగా చదువుకుని ఆ తర్వాత సినిమా థియేటర్లలో కటౌట్లు పెట్టుకోండి. నలుగురు మంచి పనులు చేసి ఆదర్శంగా నిలవాలని పిలుపు ఇచ్చారు. అసలు ఇటువంటి దుర్ఘటపై ఇయర్ ఎండింగ్ స్పెషల్ స్టోరీ.
మొన్న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ కోమాలోకి వెళ్ళిపోవడం, పిల్లాడి తల్లి రేవతి చనిపోయిన తరవాత ఒక నాన్నగా, ఒక మనిషిగా రెండు ప్రశ్నలు, ఆలోచనలు ప్రతీవారికీ కలిగాయి.