ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)దర్శక ధీరుడు రాజమౌళి(rajamouli)అభిమానులు కల ఈ రోజు ఫలించిందని చెప్పవచ్చు.వాళ్లంతా ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ssmb 29 మూవీ ఓపెనింగ్ ఈ రోజు హైదరాబాద్ లోని అల్యూ మినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది.ఈ వేడుకలో మహేష్,రాజమౌళితో పాటు చిత్ర బృందం మొత్తం పాల్గొంది.అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన కథ ఏమైవుంటుందనే చర్చ అందరిలో మొదలయ్యింది. రాజమౌళి ఇంకా అధికారంగా చెప్పకపోయినా కూడా రాజమౌళి తండ్రి ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ మాత్రం చాలా ఇంటర్వూస్ లో మహేష్ తో చేసే మూవీ అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కే అడ్వెంచర్ మూవీ అని చెప్పుకొచ్చాడు.పైగా రాజమౌళి కూడా అందుకు తగ్గట్టే ఫారెస్ట్ లొకేషన్స్ ని సంబంధించి ఇతర దేశాలకి కూడా వెళ్లడం జరిగింది.దాని తాలూకు వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్నాయి.దీంతో ఇక ssmb 29 ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే కథ అని ఫిక్స్ అయినట్టే.

ఇక రాజమౌళి తన ప్రతి సినిమా ఓపెనింగ్ ని  భారీ ప్రమోషన్స్ తో ప్రారంభిస్తాడు.కానీ మహేష్ సినిమాని మాత్రం చాలా సైలంట్ గా ప్రారంభించాడు.వేసవి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుందనే వార్తలు వస్తున్నాయి.మరి మిగతా ఆర్టిస్టుల వివరాలతో పాటు మూవీ ఎన్ని రోజులు సెట్స్ పై ఉంటుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనే లాంటి వివరాలు ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here