జేపీ నేత, సినీ నటి మాధవి లతపై తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రెడ్డి మాధవి లతను అనుచిత వ్యాఖ్యలతో ఆరోపిస్తూ ఆమెను వేస్ట్ క్యాండిడేట్ అని అభివర్ణించారు. మాధవీలతను పార్టీలో చేర్చుకోవాలన్న బీజేపీ నిర్ణయాన్ని తప్పు పట్టారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన ఓ ఘటనతో ఈ వివాదం తలెత్తింది. తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించగా మాధవి లత వీడియో ద్వారా విమర్శించారు. జెసి పార్క్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, మహిళలు అక్కడికి వెళ్లకుండా చూడాలని ఆమె సూచించారు.
ఈ ఆరోపణలపై ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ.. జేసీ పార్క్ వద్ద అలాంటి ఘటనలు జరగలేదని ఖండిస్తున్నట్లు తెలిపారు. మహిళలను అవమానించేలా మాధవి లత వ్యాఖ్యలు చేశారని, వారి కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడంలో తప్పేంటని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here