సహజనటి జయసుధ గత కొంత కాలంగా అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా లేరు. దీంతో నటి జయసుధకు ఏమైంది.. ఎక్కడికి వెళ్లిపోయారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు? ఈ క్రమంలో గతంలో వచ్చిన మూడో పెళ్లి ప్రస్తావన మళ్లీ తెరపైకి వచ్చింది..కంటే కూతుర్నే కనాలి… ఇన్స్పెక్టర్ ఝాన్సీ… ఆడపులి.. లాంటి సినిమాల్లో ప్రేక్షకులను అలరించిన సహజ నటి జయసుధ ఎన్నో వైవిద్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. రీల్ లైఫ్‌లో ఏ పాత్ర చేసిన అతికినట్లు చేసిన ఆమె.. రియల్ లైఫ్‌లోనూ అంతే పేరు తెచ్చుకున్నారు. అటునటిగా, ఇటు రాజకీయ నాయకురాలిగా తనకంటూ ఓ మార్కును వేసుకున్నారు. కానీ గత కొంతకాలంగా అటు సినిమాల్లోనూ ఇటు పొలిటికల్‌గానూ యాక్టివిటీ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆవిడ రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లేనా? లష్కర్ మాజీ ఎమ్మెల్యే ఎక్కడా? అంటూ సర్వత్రా చర్చ నడుస్తుంది.

తెలంగాణ ఏర్పాటు తర్వాత పొలిటికల్‌గా ఆమె రాణించలేకపోయారు. జయసుధ కాంగ్రెస్ పార్టీ తరఫున 2009లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య హయాంలో యాక్టివ్‌గా కనిపించిన ఆమె.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆమె పొలిటికల్ యాక్టివిటీస్‌ తగ్గిపోయాయి. సినిమాలో సహజ నటిగా తన మార్క్ చాటుకున్న జయసుధ లష్కర్ ఎమ్మెల్యేగా ఏ మాత్రం గుర్తింపు సాధించలేకపోయారు. కాంగ్రెస్‌లోనే దశాబ్ద కాలంపైగా కొనసాగిన జయసుధ.. గత ఎన్నికలకు ముందు కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీకి క్రిస్టియన్ల మద్దతు కూడగడతానని కూడా చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. కానీ ఎన్నికల తర్వాత ఆమె గప్ చుప్ అయ్యారు. నేషనల్ లెవల్లో తన నటనకు అవార్డ్స్ వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న జయసుధకు నిరాశే ఎదురైంది. ఈ కారణంగానే బీజేపీకి కూడా ఆమె దూరంగా ఉందనే ప్రచారం సాగుతోంది. మాంగల్య బలం, మంగళ్యానికి మరో ముడి చిత్రాల్లో నటించిన జయసుధ ఇటీవలే మూడో పెళ్లి చేసుకుందనే ప్రచారం జోరుగా వినిపించింది. విచిత్ర జీవితం.. వివాహ బంధం లాంటి సినిమాల్లో మెప్పించిన జయసుధ తన మూడో పెళ్లి ప్రచారాన్ని ఎక్కడా ఖండించలేదు. మొత్తానికి ఇంటిని దిద్దిన ఇల్లాలు.. ఎదురీతతో ఒంటరి పోరాటం చేస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here