ఇక్కడ రైలు ఆగగానే దెయ్యాలు దిగుతాయి. అంతేకాదు..అక్కడ పగలు, రాత్రి ఏ సమయంలోనైనా సరే.. ప్రజలు ఒంటరిగా నడవడానికి కూడా భయపడుతున్నారు. ఈ కారణంగానే 42 ఏళ్లు ఈ స్టేషన్‌ను మూసివేశారు.. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారతీయ రైల్వేలు ఆసియాలో రెండవ అతిపెద్ద రైల్వే వ్యవస్థగా చెబుతారు. రోజూ వేల, లక్షల మంది ప్రజలు ఈ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. భారతదేశంలో సుమారు 8 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవన్నీ దేనికదే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ప్రతి రైల్వే స్టేషన్ పలు కారణాల వల్ల ప్రసిద్ధి ఉంటుంది. అయితే, మనదేశంలో అత్యంత భయంకరమైన రైల్వేస్టేషన్ కూడా ఉందని మీకు తెలుసా..? ఇక్కడ రైలు ఆగగానే దెయ్యాలు దిగుతాయి. అంతేకాదు..అక్కడ పగలు, రాత్రి ఏ సమయంలోనైనా సరే.. ప్రజలు ఒంటరిగా నడవడానికి కూడా భయపడుతున్నారు. ఈ కారణంగానే 42 ఏళ్లు ఈ స్టేషన్‌ను మూసివేశారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..
బెగుంకోదర్ రైల్వే స్టేషన్:
దెయ్యాల రైల్వే స్టేషన్ అనగానే చాలా మంది ఆశ్చర్యపోతారు.. అదేంటని జోక్‌గా కొట్టి పడేస్తుంటారు. కానీ.. ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో ఉంది. దీని పేరు బెగుంకోదర్ రైల్వే స్టేషన్. ఇది భారతదేశంలోని అత్యంత హాంటెడ్ రైల్వే స్టేషన్‌లలో ఒకటిగా పిలుస్తారు.. ఇక్కడికి వచ్చే చాలా మంది ప్రయాణికులు తెల్లటి చీరలో ఉన్న ఆడ దెయ్యాన్ని చూశారట. ఇది కాకుండా స్టేషన్‌కు సంబంధించిన అనేక భయానక కథనాలు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఈ స్టేషన్‌తో సంబంధం ఉన్న దెయ్యాల ఆత్మ కారణంగా 42 సంవత్సరాలు మూసివేయబడింది. తర్వాత 2009లో మళ్లీ తెరవబడింది.