తెలంగాణ మాజీ మంత్రి కెటీఆర్ సోమవారం ఎసిబి ఆఫీసుకు హాజరయ్యారు. కెటీఆర్ రాక సందర్బంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్ లు చేస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కెటీఆర్ ఎ వన్ ముద్దాయి. బంజారాహిల్స్ ఎసిబి కార్యాలయంలో విచారణకు హాజరుకావావాలని ఎసిబి అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులు శుక్రవారమే జారీ అయ్యాయి. కెటీఆర్ తో బాటు ఈ కేసులో నిందితులైన బిఎల్ ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్ లకు నోటీసులు అందాయి. కెటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని విచారించాలని తొలుత నిర్ణయించారు. పది గంటలకు కెటీఆర్ విచారణకు హాజరైనప్పటికీ ఎసిబి అధికారులు కార్యాాలయంలోకి అనుమతించలేదు. కెటీఆర్ తన వెంట అడ్వకేట్లను తెచ్చుకోవద్దని ఎసిబి కండిషన్ పెట్టింది. ఎసిబి కార్యాలయం గేటుముందే చాలా సేపు కెటీఆర్ ఎసిబి అధికారులతో గొడవపడి వెనుదిరిగారు