సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రొడక్షన్ టీం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది.
ఈ నేపథ్యంలో శనివారం రాజమండ్రిలో గ్రాండ్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వేలాదిగా అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ హాజరుకావడం విశేషం. ఆయన పాల్గొనడం మెగా ఈవెంట్‌కు ప్రత్యేక శోభను చేకూర్చింది.
ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తర్వాత, రామ్ చరణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా బాబాయ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఈవెంట్‌కు హాజరైనందుకు,ఎల్లప్పుడూ తన పక్కన నిలబడినందుకు పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్వీట్‌తో పాటు ఫోటోలు కూడా జత చేశారు. ఇవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు అభిమానుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది.