ఇప్పుడు దేశంలో ఎక్కడా చూసిన పుష్ప -2 సినిమా మానియానే. చిన్నారులు, యువత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాషన్ ను ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ధరించిన కాస్ట్యూమ్స్ పై అందరి దృష్టిపడింది. అయితే సినీ హీరో అల్లు అర్జున్ ధరించిన వస్త్రాలు ఎక్కడి నుంచి తెప్పించారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకొని ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పుష్ప సినిమాలో హీరో అర్జున్ మేనరిజాన్ని ఆయన అభిమానులు ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగులు చెప్పే సమయంలో అల్లు అర్జున్ ధరించిన కాస్ట్యూమ్స్ పై అందరి దృష్టిపడింది. పోలీస్‌ ఆఫీసర్‌ బన్వర్‌సింగ్‌ షెకావత్‌తో.. ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకొన్నావా, పుష్ప అంటే వైల్డ్‌ ఫైర్‌’అనే డైలాగ్‌ చెప్పినప్పుడు.. హీరో అల్లు అర్జున్‌ బీరపువ్వు రంగు ఇక్కత్‌ సీకో పట్టు షర్ట్‌ ధరించాడు.

అయితే ఈ ఇక్కాత్ పట్టు వస్త్రం పోచంపల్లి చేనేత కార్మికులు నేసినదే. ఇపుడు మార్కెట్‌లో అల్లు అర్జున్‌ ధరించిన ఇక్కత్‌ డిజైన్‌ చేనేత వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. మగువలు మెచ్చే పట్టు చీరలకు నిలయం.. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యానికి ప్రతీక పోచంపల్లి చేనేత వస్త్రాలు. ఇక్కడి కళాకారులు నేసిన వస్త్రాలు అంతర్జాతీయ స్థాయిలో తళుకులీనుతున్నాయి. ఈ ఇక్కత్ వస్త్రాలు ఫ్యాషన్‌ ప్రియులు, డిజైనర్లను ఆకట్టుకుంటాయి. పుష్ప 2 సినిమా కాస్ట్యూమ్స్ డిజైనర్ పోచంపల్లి చేనేత కార్మికులు నేసిన ఇక్కత్‌ పట్టుతో డిజైన్ చేసిన షర్ట్ ను అల్లు అర్జున్‌ ధరించాడు. కాగా పుష్ప 2 సిని మా షూటింగ్‌ను పోచంపల్లిలో మూడు రోజుల పాటు నిర్వహించారు. ఆ సందర్భంగా పోచంపల్లికి వచ్చిన చిత్రం యూనిట్‌ ఇక్కత్‌ వస్త్రాలను కొనుగోలు చేశారని పోచంపల్లి వస్త్ర వ్యాపారులు తెలిపారు. తామనేసిన ఇక్కత్ సికో పట్టు వస్త్రాన్ని హీరో అల్లు అర్జున్ ధరించడం పట్ల చేనేత కార్మికుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here