Christmas Holidays: పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు ఎగిరి గంతులేస్తారు. ఇప్పుడు క్రిస్మస్ పండగ వచ్చేస్తోంది. విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. క్రిస్మస్ పండగకు వరుస సెలవులను ప్రకటించింది..
పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు ఎగిరి గంతులేస్తారు. ఇప్పుడు క్రిస్మస్ పండగ వచ్చేస్తోంది. ఎన్ని రోజులు సెలవులు ఇస్తారోనని విద్యార్థులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. క్రిస్మస్ పండగకు సెలవులను ప్రకటించింది. హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
డిసెంబర్ 24 నుంచి 26 వరకు ప్రభుత్వం క్రిస్మస్ సెలవులను ప్రకటించింది. దీంతో తెలంగాణలో అన్ని పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే జనరల్ హాలీడే కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. దీంతో వరుస సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. కాగా, 2023లో క్రిస్మస్ వేడుకల కోసం తెలంగాణ ప్రభుత్వం ఐదు రోజులు సెలవులు ప్రకటించింది. డిసెంబర్ 22 నుంచి 27 వరకు సెలవులు ఇచ్చింది. ప్రస్తుతం మూడు రోజుల పాటు సెలవులను ఇస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.