18 ఏళ్ల కిందట ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత నుంచి ఆమెకు పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి రావడం మొదలైంది. ఎంతమంది డాక్టర్ల దగ్గరకు వెళ్లినా ఏమాత్రం లాభం లేకపోయింది. ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చి 18 సంవత్సరాలు గడుస్తోంది. అయితేనేం అప్పటి నుంచి ఆమె హెల్త్ కండీషన్ దిగజారిపోయింది. పొత్తికడుపులో తీవ్రమైన నొప్పితో బాధపడుతూ.. నెలలో మూడు లేదా నాలుగు సార్లు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోంది. తీరా ఏడాది కిందట ఓ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లగా.. అక్కడి సిబ్బంది ఎక్స్‌రే తీసి దెబ్బకు షాక్ అయ్యారు. ఆమె ప్రైవేటు పార్ట్‌లో కనిపించింది చూసి దెబ్బకు కళ్లు తెలేశారు. వివరాల్లోకి వెళ్తే.. థాయ్‌లాండ్‌కు చెందిన 36 ఏళ్ల మహిళ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా.. 18 ఏళ్లుగా తీవ్రమైన నొప్పితో బాధపడింది. 18 సంవత్సరాల క్రితం సదరు మహిళ ప్రసవ వేదనలో ఉండగా.. కుటుంబీకులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు.

ఆ సమయంలో ఆపరేషన్ చేస్తుండగా.. సదరు మహిళ ప్రైవేటు పార్ట్‌లో సూది పెట్టి మర్చిపోయారు వైద్య సిబ్బంది. అప్పుడు అధిక రక్తస్రావం అవుతుండటంతో.. గాయాన్ని కుట్లు వేయడం గురించి ఆలోచించారు తప్పితే.. సూది గురించి పట్టించుకోలేదు వైద్యులు. ఇక ఆ ఆపరేషన్ అనంతరం సదరు మహిళ పొత్తికడుపు, ప్రైవేటు పార్ట్‌లో తీవ్రమైన నొప్పితో బాధపడుతూ వచ్చింది. నెలకు మూడు లేదా నాలుగు సార్లు వైద్యం చేయించుకుంటూ వచ్చింది. కానీ నొప్పి నుంచి మాత్రం ఉపశమనం లభించలేదు. గతేడాది ఆమె వైద్యం చేయించుకునేందుకు ఓ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా.. ఎక్స్‌రే అసలు విషయం బయటపడింది. శస్త్రచికిత్స నిర్వహించేందుకు వైద్యులు ప్రయత్నించగా.. ఆ సూది ఉన్న చోటును సరిగ్గా పరిశీలించలేకపోయారు. దీంతో ఆమె ఆపరేషన్ మూడుసార్లు వాయిదా పడింది. ఇప్పటికీ ఆ సూది ఆమె శరీరంలోనే ఉండగా.. మెడికల్ ఇన్సూరెన్స్ ఉండటంతో వల్ల ఇన్నేళ్లు తన వైద్యులు ఖర్చులు కడుతూ వచ్చానని సదరు మహిళ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here