సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్‌పై హైదరాబాద్ సీపీ సివి ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చిక్కడపల్లి సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశాం. అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు రావడం వల్లే తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్‌కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తాం’ అని అన్నారు. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్‌ను రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు సిద్దం అయ్యారు. దానికి తగ్గట్టుగా రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేయనున్నారు.

మరోవైపు చిక్కడపల్లి పీఎస్ వద్దకు భారీగా అల్లు అభిమానులు చేరుకుంటున్నారు. తగ్గేదేలే అంటూ.. ఈసారి మావాడే సీఎం అని ఓ స్కూల్‌లో బోర్డు మీద రాశారు అల్లు అర్జున్(ఆర్మీ) అభిమానులు. అటు అల్లు అరవింద్‌ కూడా అర్జున్‌తోపాటు పోలీస్‌ వాహనం ఎక్కడంతో.. వద్దని వారించిన బన్నీ. దీనికి సంబంధించి ఏం జరిగినా.. అది మంచైనా, చెడైనా అంతా నాదేనంటూ తండ్రిని పోలీస్‌ వాహనం నుంచి దించేసిన అల్లు అర్జున్‌.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here