సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌ చేయడం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. పలువురు సినీ ప్రముఖులు బన్నీకి మద్దతుగా నిలుస్తున్నారు.ఈ క్రమంలోనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అల్లు అర్జున్ అరెస్టుపై సంచలన ట్వీట్ చేశారు.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ఇందులో తెలంగాణ పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు ఆర్జీవీ. ముఖ్యంగా సమాధానం చెప్పాలని నాలుగు ప్రశ్నలు సందించారు. అందులో

1. పుష్కరాలు, ఉత్సవాలు జరిగినప్పుడు తోపులాటలో భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా?

2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా?

3. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా చనిపోతే హీరో, హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా?

4. భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చెయ్యగలరు?’

అని రామ్ గోపాల్ వర్మ పోలీసులను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. బన్నీ అభిమానులు ఆర్జీవీ పోస్టును షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.

అంతకు ముందు కూడా పలువురు హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు అల్లు అర్జున్ కు మద్దతుగా ట్వీట్స్ చేశారు. భోళా శంకర్ దర్శకుడు మెహర్ రమేష్ స్పందిస్తూ.. ‘అల్లు అర్జున్‌ అరెస్ట్ ను ఖండిస్తున్నాం. ఆయన తరఫున మేము నిలబడతాం’ అని ట్వీట్ చేశారు. అలాగే ఆది సాయి కుమార్ రియాక్ట్ అవుతూ.. ‘ జరిగిన ఘటన దురదృష్టకరం.. కానీ దానికి ఒక్కరినే బాధ్యుడిని చేయడం బాధాకరం…. అల్లు అర్జున్‌ తో మేమున్నాం ‘ అని ట్వీట్ చేశాడు. ఇక తొక్కిసలాటకు ఒక్కర ఎలా బాధ్యులవుతారంటూ ప్రశ్నించాడు సందీప్‌ కిషన్‌. లవ్‌ యూ అల్లు అర్జున్‌ అన్నా అంటూ సందీప్ ట్వీట్ చేశాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here