తెలుగు సినీపరిశ్రమలో ఒకే సినిమాతో సెన్సెషన్ అయ్యింది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ అలా కాకుండా అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
ఒకప్పుడు తెలుగు సినీరంగంలో ఆమె చాలా పాపులర్. తొలి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది. అందం, అభినయంతో కుర్రాళ్ల మతిపోగొట్టేసింది. ఆమె మరెవరో కాదు.. మిస్త్రీ చక్రవర్తి. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు.
గుర్తుపట్టలేరు కదా.. 2013లో పొరిచేయ్ అనే సినిమాతో బెంగాలీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. తొలి చిత్రంతోనే అక్కడ చాలా ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి చాలా ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ అమ్మాయి ఫోటోస్ వైరలవుతున్నాయి.
ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఈ హీరోయిన్ లేటేస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
ఒకప్పుడు పద్దతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గ్లామర్ క్వీన్ గా మారిపోయి అసలు గుర్తుపట్టలేనంతగా కనిపిస్తుంది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది.
ఇక తెలుగులో నితిన్ సరసన చిన్నదాన నీకోసం సినిమాలో నటించింది. ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరోయిన్.. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు.