సంధ్య థియేటర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న అల్లుఅర్జున్(allu arjun)కి నిన్నహైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా కూడా, ఈ రోజు జైలు నుంచి విడుదల కావడం జరిగింది.ఈ విషయం మీద అల్లు అర్జున్ తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్ట్ బెయిల్ ఉత్తర్వుల్లో తక్షణం విడుదల చేయాలి అని స్పష్టంగా ఉన్నా కూడా జైలు అధికారులు ఆ రూల్స్ ని పాటించ కుండా అల్లు అర్జున్ ని అక్రమంగా నిర్బందించారు.అందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ అంశంపై తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పడం జరిగింది.
ఇక తాజాగా అల్లు అర్జున్ విషయంపై కాంగ్రెస్ ఎమ్ఎల్ సి తీన్మార్ మల్లన్నమాట్లాడుతు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తానొక్కడకే జాతీయ అవార్డు ఉండాలని అల్లు అర్జున్ కుట్ర పన్నలేదా,జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో కూడా అల్లు అర్జున్ కుట్ర ఉందా,లేదా. పైగా జానీ మాస్టర్ కి బెయిల్ వచ్చినా కూడా నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని లేఖ రాసింది వీళ్ళు కాదా.మరి ఈ కేసులో అల్లు అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డు ని వెనక్కి ఇస్తాడా అని మల్లన్న కామెంట్స్ చేసాడు.ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా మారాయి.