ఓ టీవీ ఛానల్ రిపోర్టర్‌పై మంచు మోహన్‌బాబు దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. రిపోర్టర్‌పై హత్యాయత్నం చేశారంటూ మోహన్‌బాబుపై కేసు నమోదైంది. దీంతో ముందస్తు బెయిల్ కోసం మోహన్‌బాబు పిటిషన్ వేశారు. శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఈ పిటిషన్ వేశారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసిందని, దీంతో మోహన్‌బాబు పరారీలో ఉన్నాడని ప్రచారం జరిగింది. అతని స్టేట్‌మెంట్ కోసం పోలీసులు నివాసానికి వెళ్ళగా ఆయన అక్కడ లేరని చెబుతున్నారు. ఎక్కడ ఉన్నారో కూడా తెలీదని కుటుంబసభ్యులు చెప్పారంటున్నారు. మరో పక్క కొన్ని టీవీ ఛానల్స్‌లో మోహన్‌బాబు పరారీలో ఉన్నారని, ఆయన పట్టుకునేందుకు నాలుగు బృందాలు గాలిస్తున్నాయని వార్తలు వచ్చాయి.
తనపై జరుగుతున్న ప్రచారంపై తాజాగా మోహన్‌బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘నాపై దుష్ప్రచారం జరుగుతోంది. నేను పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఇప్పటికీ కోర్టులో ఉంది. దాన్ని కొట్టివేయడం జరగలేదు. నేను డాక్టర్ల పర్యవేక్షణలో నా ఇంటిలోనే ఉన్నాను. మీడియా నా గురించి నిజాలు మాత్రమే రాయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు మోహన్‌బాబు.