పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా,పంచాయితీ రాజ్ అండ్ అటవీ శాఖ మంత్రిగా తన బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించడం జరుగుతుంది.అదే విధంగా మరో పక్క షూటింగ్ లో కూడా పాల్గొంటూ మార్చి 28 న హరిహరవీరమల్లు మూవీ అభిమానుల ముందుకు తీసుకురావడానికి సిద్దమవుతున్నాడు.
రీసెంట్ గా జరిగిన ఒక ప్రజా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతు ఒక పొలిటికల్ పార్టీ ని స్థాపించడం అంటే ఆత్మహత్య సదృశ్యం లాంటింది.ఎన్నో పోరాటాలు చేసి ఎంతో మందిని మెప్పించాలి.రామాయణంలో ఆంజనేయ స్వామికి ఆయన శక్తి ఆయనకు తెలియదు.ఒక శాపం వలన మర్చిపోతాడు.కానీ ఆ తర్వాత సీతమ్మ తల్లిని వెతికే క్రమంలో జాంబవంతుడిని కలిస్తే అప్పుడు ఆంజనేయ స్వామికి తన సత్తా గురించి చెప్పడంతో అప్పుడు ఆంజనేయ స్వామి సముద్రం ధాటి లంక వైపు సీతమ్మ దగ్గరకి వెళ్తాడు.ఈ కథని ఐఏఎస్ ఆఫీసర్స్ కి చెప్పి నేను జాంబవంతుడ్ని, మీరు ఆంజనేయుడు లాంటి వాళ్ళని చెప్పానని విషయాన్నీ చెప్పాడు.అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని తీరుని మెచ్చు కోవడమే కాకుండా ఆయన లాంటి నాయకుడు కావాలని కూడా చెప్పడం జరిగింది.