రంగా రెడ్డి జిల్లా చిలుకూరు లో గురుకుల పాఠశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. సంక్షేమహాస్టళ్లలో కామన్ డైట్ ను ఆయన ప్రారంభించారు. డైట్ చార్జీలను, కాస్మొటిక్ చార్జిలను పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. బిఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చార్జిలను పెంచలేకపోయిందన్నారు. గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు అధిరోహించిన వారేనని బుర్రా వెంకటేషం, మహేందర్ రెడ్డిలు గురుకులాల నుంచి వచ్చిన వారే నని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.