ప్రముఖ తబలా వాయి ద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కాసేపటి క్రితమే కన్నుమూశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తబలా విద్యాంసుడు జాకీర్ హుస్సేన్ (73) హఠాన్మరణం చెందారు. అనారోగ్యంతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన మృతితో భారతీయ చలన చిత్ర రంగం, సంగీత అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ముంబైలో పుట్టిన జాకీర్ హుస్సేన్ పద్మశ్రీ, పద్మవిభూషన్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ గత కొన్నేళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో ఆస్పత్రిలో ఆయనను చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో జాకీర్ హుస్సేన్ కన్నుమూసినట్లు తెలుస్తోంది.
తండ్రి వద్ద సంగీతం నేర్చు కుని..
జాకీర్ హుస్సేన్ 9 మార్చి 1951న ముంబైలో జన్మించారు. అతని తండ్రి ఉస్తాద్ అల్లా రఖా దేశంలోని ప్రముఖ పెర్కషన్ వాద్యకారుడు. అతను పండిట్ రవిశంకర్, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ వంటి గొప్ప కళాకారులతో జుగల్బందీ ప్రదర్శించేవాడు. తన తండ్రి అల్లా రఖా మార్గాన్ని అనుసరించి, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ సంగీతాన్ని తన కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఆ తర్వాత దానినే తన జీవితంగా చేసుకున్నాడు. జాకీర్ హుస్సేన్ చాలా చిన్న వయస్సు నుండి తబలా నేర్చుకోవడం ప్రారంభించాడు. అతని మొదటి గురువు అతని తండ్రి. జాకీర్ హుస్సేన్ 11 సంవత్సరాల వయస్సులో సంగీత శిక్షణ తీసుకున్నాడు. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన విశేష కృషికి గాను ఆయనకు పద్మశ్రీ, పద్మవిభూషణ్ వంటి ప్రతిష్హాత్మక అవార్డులు వరించాయి. జాకీర్ తబలా వాద్య నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయన బాలీవుడ్ పాటలకు కూడా పనిచేశారు. కాగా జాకీర్ సన్నిహితుడు ప్రముఖ చిత్రకారుడు రాకేష్ చౌరాసియా కూడా జాకీర్ హుస్సేన్ ఆరోగ్యంపై గత వారం అప్డేట్ ఇచ్చారు. జాకీర్ హుస్సేన్ రక్తపోటుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని ఆయన చెప్పారు.