తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు బుధవారం ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ సర్కార్ కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ముందుకు రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌-ROR చట్ట సవరణ బిల్లు రాబోతోంది. సభలో ROR-2024 బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది.

ధరణి పోర్టల్‌ను భూమాతగా మార్చాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ROR-2020 చట్టం రద్దు అవుతుంది. కొత్త చట్టం ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి ల్యాండ్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తారు. అలాగే, ప్రతి భూ కమతానికి భూధార్ నెంబర్ జారీచేస్తారు. అంతేగాకుండా, గ్రామ కంఠం స్థలాలకు ప్రభుత్వం హక్కులు కల్పిస్తుంది. పట్టా భూమి ఉన్న యజమానుల హక్కుల సంరక్షణతోపాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు భద్రతాపరమైన సెక్షన్లను కొత్త ROR బిల్లులో చేరుస్తారు. అసెంబ్లీలో బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రవేశపెడతారు.

ఆటోడ్రైవర్ల వేషధారణలో బీఆర్ఎస్‌ నిరసనలు చేపట్టింది.. నిన్న నల్లచొక్కాలతో సభకు వచ్చిన బీఆర్ఎస్‌ సభ్యులు.. ఇవాళ ఖాకీ చొక్కాలతో అసెంబ్లీకి హాజరయ్యారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై ఇవాళ బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.. 93 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని.. సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు..ఆటోడ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని.. ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కేటీఆర్‌ సూచించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here